ODI World Cup | వరల్డ్ కప్ డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఆఫ్ఘనిస్థాన్ షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల దాటికి తట్టుకోలేక ఇంగ్లండ్ విలవిలలాడింది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లకు 40.3 ఓవర్లలోనే 215 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ పై ఆఫ్ఘనిస్థాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జానీ బరిష్టాతోపాటు ఓపెనర్‌గా వచ్చిన హరిబ్రూక్.. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా.. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. 35వ ఓవర్లో ముజిబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌లో వేసిన నాలుగో బంతిని ఆడబోయి నేరుగా వికెట్ కీపర్ ఇక్రం అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటి వరకు హరిబ్రూక్ వ్యక్తిగత స్కోర్ 66 పరుగులు. అందులో ఏడు బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. 39వ ఓవర్లో అదిల్ రషీద్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.
అంతకుముందు ఫజలాఖ్ ఫరూఖీ బౌలింగ్‌లో రెండో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ జానీ బరిష్టా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జానీ బరిష్టా స్థానం వన్ డౌన్‌గా వచ్చిన జాయ్ రూట్.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్ లో బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. ఆఫ్ఘన్ బౌలర్లను తట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న డేవిడ్ మలాన్ 13వ ఓవర్ లో మహమ్మద్ నబీ వేసిన బంతిని షార్ట్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా ఇబ్రహీం జాడ్రన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు