ఎవ్వరూ ఊహించని మ్యాచ్ ఇది. పేరుకు చిన్న టీమ్ అయినా కూడా ఆఫ్ఘనిస్థాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో అదరగొట్టింది. కేవలం నాలుగు వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసి స్కాట్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 10 ఓవర్లకే కుప్పకూలిపోయింది. 10.2 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 60 పరుగులే చేసి ఆల్ఔట్ అయింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
నిజానికి ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా జజాయ్, జద్రాన్. ఇద్దరూ కలిసి ఆఫ్ఘాన్‌కు భారీ పరుగులను అందించారు. అలాగే.. రహ్మనుల్లా కూడా ఎక్కువ పరుగులు చేసి భారీ స్కోర్ అందించాడు.
స్కాట్లాండ్ ఆటగాళ్లలో జార్జ్ మున్సె మాత్రం 25 పరుగులు చేశాడు. మిగితా ప్లేయర్స్ అంతా తక్కువ పరుగులు చేసి పెవిలియన్ చేరిన వాళ్లే. జార్జ్ 18 బంతుల్లో 25 పరుగులు చేయగా.. క్రిస్ గ్రీవ్స్ 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు.
స్కాట్లాండ్ కెప్టెన్ కైలె కొయెట్జర్ కూడా పెద్దగా రాణించలేదు. 7 బంతుల్లో 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాలమ్ మాక్ లోయెడ్, రిచీ బెరింగ్టన్, మాథ్యూ క్రాస్, మైకెల్ లాంటి ప్లేయర్లు ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు.
ఆప్ఘాన్ బౌలర్లలో రహ్మాన్ 4 ఓవర్లు వేసి 5 వికెట్లు తీయగా.. రషిద్ ఖాన్ 2.2 ఓవర్లలో 4 వికెట్లు, నవీన్ 2 ఓవర్లలో ఒక వికెట్ తీశాడు.
Mujeeb Ur Rahman, you beauty 👌 #T20WorldCup #AFGvSCO pic.twitter.com/sUSo7dbrY2
— T20 World Cup (@T20WorldCup) October 25, 2021
Afghanistan with a comprehensive victory 🔥 #T20WorldCup | #AFGvSCO | https://t.co/qgmElzPLDG pic.twitter.com/ltJW8atadJ
— T20 World Cup (@T20WorldCup) October 25, 2021
What a spell from Mujeeb 💥
— T20 World Cup (@T20WorldCup) October 25, 2021
He has his fifth 🖐️
Scotland lose their seventh as Watt departs.#T20WorldCup | #AFGvSCO | https://t.co/qgmElzPLDG pic.twitter.com/qhz2oc3tJo
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Afghanistan vs Scotland : ముగిసిన ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్.. 20 ఓవర్లకు ఆఫ్ఘాన్ స్కోర్ ఎంతంటే?
Afghanistan vs Scotland : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
Ind vs Pak | పాక్‌పై ఓటమితో షమీపై ట్రోలింగ్.. స్పందించిన సెహ్వాగ్
IPL New Teams | ఐపీఎల్లో కొత్తగా వచ్చే జట్లు ఇవే.. ఎంత ధర పలికాయో తెలుసా?