Ind vs Pak | పాక్‌పై ఓటమితో షమీపై ట్రోలింగ్.. స్పందించిన సెహ్వాగ్
Ind vs Pak | టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలమైంది.

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్‌లో కోహ్లీ, పంత్ తప్ప మిగతా ఎవరూ కనీస స్థాయి ప్రదర్శన కూడా చేయలేదు. బౌలింగ్‌లో అసలు ఎవరూ అంచనాలను అందుకోలేదు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యంత శక్తిమంతమైన, అనుభవం ఉన్న బౌలింగ్ దళాల్లో ఒకటిగా పేరొందిన భారత్.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిదంటేనే బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు తమ కోపాన్ని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై కేంద్రీకరించారు.
పాక్‌పై ఈ వెటరన్ పేసర్ తన అనుభవాన్ని కూడా క్యాష్ చేసుకోలేకపోయాడు. మొత్తం 3.5 ఓవర్లు వేసిన అతను ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. యావరేజ్ 11.20 నమోదు చేశాడు. దీంతో నెటిజన్లు అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
షమీకి తన మద్దతు తెలిపాడు. ట్రోలింగ్ చేస్తున్న వారిని తప్పుబట్టాడు. ‘భారత జెర్సీ వేసుకుని ఆడే ప్రతి ఆటగాడి మనసులో ఇలాంటి ట్రోలర్ల కన్నా ఎక్కువగా దేశభక్తి ఉంటుంది. షమీపై కామెంట్స్ చూసి షాకయ్యా. ఈ విషయంలో క్రికెట్ ప్రపంచం అతని వెంట ఉంటుంది’ అని సెహ్వాగ్ అన్నాడు. ‘షమీ నీతోనే ఉన్నా. వచ్చే మ్యాచ్‌లో సత్తా చూపించు’ అంటూ ట్వీట్ చేశాడు.
The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virrender Sehwag (@virendersehwag) October 25, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

