ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ మధ్య పోరు కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్ బ్యాటింగ్ బరిలోకి దిగి చెలరేగిపోయింది. 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి స్కాట్లాండ్కు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆఫ్ఘాన్ ప్లేయర్లలో నజిబుల్లా జద్రాన్.. టీమ్‌ను ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి చివరి బంతిలో షరీఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. జద్రాన్.. 34 బంతుల్లో 59 పరుగులు చేసి ఆఫ్ఘాన్ స్కోర్‌ను పెంచాడు. మరో బ్యాట్స్‌మెన్ రహ్మనుల్లా 37 బంతుల్లో 46 పరుగులు చేశాడు. జజాయ్ 30 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆఫ్ఘాన్ కెప్టెన్ 4 బంతుల్లో 11 పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు.
స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. జోష్ డవే 4 ఓవర్లు వేసి ఒక వికెట్, మార్క్ వాట్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు.
Afghanistan's innings comes to an end at 190/4 🙌
— ICC (@ICC) October 25, 2021
Will they start their campaign with a bang with a victory?#T20WorldCup | #AFGvSCO | https://t.co/WYvGXmbFNc pic.twitter.com/pHacot0bCg
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Afghanistan vs Scotland : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
Ind vs Pak | పాక్‌పై ఓటమితో షమీపై ట్రోలింగ్.. స్పందించిన సెహ్వాగ్
IPL New Teams | ఐపీఎల్లో కొత్తగా వచ్చే జట్లు ఇవే.. ఎంత ధర పలికాయో తెలుసా?