న్యూ చండీఘడ్: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు(Ind Vs Afg)లో ఇండియా విక్టరీకి చేరువలో ఉంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ త్వరత్వరగా తన వికెట్లను కోల్పోయింది. భారత స్పిన్నర్లు సుందర్, సుతార్.. ప్రత్యర్థి బ్యాటర్లను దెబ్బతీశారు. టీ బ్రేక్ సమయానికి అయిదు వికెట్లు కోల్పోయి 98 రన్స్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత కూడా వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. తాజా సమాచారం ప్రకారం రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు ఆఫ్ఘనిస్తాన్ తన తొలి ఇన్సింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల తీసి ఆఫ్ఘన్‌ను దెబ్బతీశాడు. అయితే రెండో ఇన్సింగ్స్‌లో కూడా ఆఫ్ఘన్ బ్యాటర్ల తడబడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 306 రన్స్ వెనుకబడి ఉన్నది.
Tea on Day 3️⃣
Washington Sundar with his 3️⃣rd wicket on the final ball of the session 👌#TeamIndia have Afghanistan 5️⃣ down in the 2nd innings 🔥
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/3ODxDznLcZ
— BCCI (@BCCI) June 8, 2026