ODI World Cup | 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ తొలి పది ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇబ్రహీం జాడ్రన్ 32, రహ్మనుల్లా గుర్బాజ్ 28 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.