కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (91) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4.. అషిత, ప్రభాత్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నె (42), నిషాన్ (36) క్రీజులో ఉన్నారు.