AFG vs NZ : ఏకైక టెస్టుకోసం భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్(Newzealand), అఫ్గనిస్థాన్(Afghanistan) జట్లకు పెద్ద షాక్. ఒక్క బంతి కూడా పడకుండానే తొలి రోజు ఆట రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా గ్రేటర్ నోయిడాలోని స్టేడియం తడిసిముద్దైంది. ఔట్ ఫీల్డ్ పూర్తిగా తడిగా ఉండడంతో అంపైర్లు టాస్ వేయకుండానే తొఒలి రోజు ఆటను రద్దు చేశారు. దాంతో, రెండో రోజు ఔట్ ఫీల్డ్ పొడిగా మారితే షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది.
తాలిబాన్ల రాజ్యం ఏర్పడ్డాక అఫ్గనిస్థాన్‌లో క్రికెట్‌కు ప్రోత్సాహం కరువైంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహిణకు అనువైన స్టేడియాలు అఫ్గన్‌లో లేవు. అందుకనే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగాల్సిన ఏకైక టెస్టు కోసం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐ (BCCI)ని ఆశ్రయించింది. అందుకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది. దాంతో, కివీస్, అఫ్గన్ జట్లు గ్రేటర్ నోయిడా చేరుకున్నాయి.
Play has been called off for Day 1 of the one-off Test between Afghanistan and New Zealand.
📸 @ACBofficials#AFGvNZ pic.twitter.com/1VmLcCBCO0
— ICC (@ICC) September 9, 2024
కానీ, గత వారం రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా స్టేడియమంతా నీళ్లతో నిండింది. సోమవారం వాన లేకున్నా సరే ఔట్‌ఫీల్డ్ తడిగానే ఉండడంతో సిబ్బంది సూపర్ సాపర్స్ ద్వారా నీటిని తోడేశారు. అయినా సరే ఔట్ ఫీల్డ్ పూర్తిగా సిద్ధమవ్వలేదు. దాంతో, అంపైర్లు మ్యాచ్ నిర్వహించేందుకు ఆసక్తి చూపలేదు