Motorola Razr 50 | మోటరోలా ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ ఫోన్ మోటరోలా రేజర్ 50.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Motorola Razr 50 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మోటరోలా రేజర్ 50 ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Motorola Razr 50 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మోటరోలా రేజర్ 50 ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 6.9 అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్, 3.63 అంగుళాల కవర్ డిస్ ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఎస్వోసీ, అల్యూమినియం ప్రేమ్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది. 4200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది.
మోటరోలా రేజర్ 50 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.64,999 పలుకుతుంది. ఈ నెల 20 నుంచి అమెజాన్, రిలయన్స్ డిజిటల్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం అవుతాయి. బీచ్ శాండ్, కోలా గ్రే, స్ప్రిట్జ్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఇంట్రడ్యూసరీ ఆఫర్ గా రూ.5000 ఫెస్టివ్ డిస్కౌంట్, రూ.10 వేల బ్యాంకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆఫర్లతో కలుపుకుంటే ఈ ఫోన్ ధర రూ.49,999లకే లభిస్తుంది. రూ.2778 నుంచి ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం అవుతుంది. రిలయన్స్ జియో నుంచి రూ.15 వేల విలువైన బెనిఫిట్లు పొందొచ్చు.
మోటరోలా రేజర్ 50 ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఎక్స్ వర్షన్ మీద పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 413 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2640 పిక్సెల్స్) పోలెడ్ ఇన్నర్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది. ఫోన్ 3.63 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1056×1066 పిక్సెల్స్) పోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఫ్రంట్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
మోటరోలా రేజర్ 50 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ, డ్యుయల్ ఔటర్ కెమెరా సెటప్ (50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 13 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా), ఇన్నర్ డిస్ ప్లేలో సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, ఏ-జీపీఎస్, ఎల్టీఈపీపీ, గ్లోనాస్, గెలీలియో, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, వై-ఫై 802.11 ఏ/ బీ/ జీ /ఎన్ /ఏసీ/ ఏఎక్స్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉండటంతోపాటు ఫేస్ అన్లాక్ ఫీచర్కు మద్దతుగా ఉంటుంది. డాల్బీ అట్మోస్ తోపాటు డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. యాక్సిలరోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, బారో మాటర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటుంది. మూడేండ్లు ఓఎస్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

