రాంచీ: అధికార పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి బూట్లను ఒక ఉన్నతాధికారి తొలగించారు. అలాగే బొగ్గు గని సందర్శన సందర్భంగా ఆయన పైజామాను సరి చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కేంద్ర మంత్రి, అధికారుల తీరుపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే (Satish Chandra Dubey) జార్ఖండ్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జనరల్ మేనేజర్ (జీఎం) అరిందమ్ ముస్తాఫీ, కేంద్ర మంత్రి సతీష్ చంద్ర బూట్లను తొలగించారు. అలాగే ధన్బాద్లోని భూగర్భ గని సందర్శన సమయంలో ఆయన పైజామాను సరిచేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవమానకరమైన విషయమని విమర్శించింది. బీసీసీఎల్ అధికారులు తమ అవినీతిని దాచడానికి ఇలాంటి చర్యల ద్వారా మంత్రులను సంతోష పెడుతున్నారని ఆరోపించింది. ‘మంత్రి కాళ్ల షూస్ జీఎం తొలగిస్తే అది సిగ్గుచేటు. జీఎంను బీబీసీఎల్ సీఎండీ (చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్)గా చేయాలి. అలాంటి బీసీసీఎల్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. తమ లోపాలను దాచిపెట్టి మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు’ అని ధన్బాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ సింగ్ మండిపడ్డారు.
On an official visit to review several coal projects of BCCL, Union Minister of State for Coal Satish Chandra Dubey was seen taking the help of a senior BCCL official to remove his shoes and tighten his pajama. #Watch #Dhanbad #Jharkhand #India #SatishChandraDubey #BCCL pic.twitter.com/v1mvbbUxWo
— Mirror Now (@MirrorNow) September 9, 2024