కోస్గి, నవంబర్ 9 : ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి అండర్-17 హ్యాండ్‌బాల్ టోర్నీలో ఆదిలాబాద్, వరంగల్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆదివారం తొలుత జరిగిన బాలికల ఫైనల్లో ఆదిలాబాద్ 16-7 తేడాతో మహబూబ్‌నగర్‌పై ఘన విజయం సాధించింది. బాలుర ఫైనల్లో వరంగల్ 22-15తో మహబూబ్‌నగర్‌పై గెలిచింది.
బాలికల, బాలుర ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్లేయర్లు ప్రతి పాయింట్ కోసం చెమటోడ్చారు. మ్యాచ్‌ల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, పీడీ నర్సింహులు బాలికల, బాలుర జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు.