e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

వాళ్లు ఆట‌గాళ్లే ! ఆ ఆట‌ల‌తోనే కోట్లు ఆర్జిస్తున్నారు.. కుబేరుల‌తోనే పోటీప‌డుతున్నారు. ఆట‌లు ఆడితే వ‌చ్చిన క్రేజ్‌తో కోట్ల‌కు కోట్లు వెనుకేసుకుంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచ‌మంతా స్తంభించిపోయినా.. గేమ్స్ ఆగిపోయినా స‌రే.. వాళ్ల సంపాద‌నకు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇంకా చెప్పాలంటే ఈ కొవిడ్‌ స‌మ‌యంలోనూ త‌మ ఆదాయాన్ని 28 శాతం పెంచుకున్నారు. మైదానంలో కంటే కూడా యాడ్స్ రూపంలోనే అధికంగా సంపాదించేస్తున్నారు. ఇలా అత్య‌ధికంగా సంపాదించిన క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ఇటీవ‌ల‌ విడుద‌ల చేసింది. 2020 మే 1 నుంచి 2021 మే 1 వ‌ర‌కు ప్రైజ్‌మ‌నీ, శాల‌రీ, బోన‌స్‌, యాడ్స్ రూపంలో వారు ఎంత సంపాదించార‌న్న వివ‌రాలు అన్నింటినీ లెక్క‌గ‌ట్టి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. మ‌రి ఈ జాబితాలో టాప్ – 5గా ఎవ‌రు నిలిచారో ఒక‌సారి చూద్దాం..

Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

మెక్‌గ్రెగ‌ర్‌

ఫోర్బ్స్ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచాడు ఐర్లాండ్‌కు చెందిన‌ మిక్స్‌డ్‌ మార్ష‌ల్ ఆర్ట్స్ క్రీడాకారుడు మెక్‌గ్రెగ‌ర్‌. రింగ్‌లో ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టి క‌రిపించ‌డంలో ముందుండే మెక్‌గ్రెగ‌ర్‌.. గ‌త ఏడాది దాదాపు రూ.1345 కోట్లు సంపాదించాడు. రింగ్ లోప‌ల ఆడి రూ.164 కోట్లు సంపాదిస్తే.. రింగ్ బ‌య‌ట రూ.1176 కోట్ల‌పైనే ఆర్జించాడు. మిగిలిన సెల‌బ్రెటీల్లా అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి బ‌దులు.. తానే ఒక విస్కీ కంపెనీలో పెట్టుబ‌డి పెట్టి వేల‌కోట్లు సంపాదించాడు.

Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

లియోనెల్‌ మెస్సీ

- Advertisement -

ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ.. అడ్వ‌ర్టైస్‌మెంట్ల రూపంలోనూ కోట్లు సంపాదిస్తూ ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గ‌త ఏడాది కాలంలో మెస్సీ రూ.972 కోట్లు సంపాదించాడు. బార్సిలోనా ఫుట్‌బాల్ క్ల‌బ్‌తో మెస్సీ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ.1256కోట్లుగా ఉంది. ఇక ఆడిడాస్ కంపెనీతో మెస్సీకి జీవిత‌కాల ఒప్పందం ఉంది. గిన్నీ హిల్‌హిగ‌ర్ బ్రాండ్‌తోనూ అత‌ను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్క అడిడాస్ డీల్‌తోనే మెస్సీ.. రూ.89 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడు. స్పెయిన్‌, అర్జెంటీనాలో అతనికి లెక్క‌లేన‌న్ని ఆస్తులున్నాయి. అందుకే త‌న‌కు ఈ జీవితాన్ని ఇచ్చిన ఫుట్‌బాల్ ఆట‌కు ఎంతో రుణ‌ప‌డి ఉంటాడు మెస్సీ. నా జీవితం మొత్తాన్ని ఫుట్‌బాల్‌కే ధార‌పోశాను. ఆ గేమ్ కూడా నాకు ఎంతో ఇచ్చింది. వాటి విలువ‌.. నా జీవితం కంటే చాలా ఎక్కువ అని మెస్సీ అంటుంటాడు.

Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

క్రిస్టియానో రొనాల్డో

మెస్సీ త‌ర్వాత ఫోర్బ్స్ జాబితాలో మూడోస్థానంలో పోర్చుగ‌ల్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ రొనాల్డో ఉన్నారు. రొనాల్డో అంటే అభిమానుల‌కు వెర్రి అనే చెప్పొచ్చు. అత‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు పెట్టినా అది వైర‌ల్ అయిపోతుంటుంది. రొనాల్డో పెట్టే ఒక్కో పోస్టుకు అత‌నికి రూ.11 కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది. గ‌త ఏడాది కాలంలో రూ.897కోట్లు సంపాదించాడు. ఇక ఫుట్‌బాల్ క్ల‌బ్ జువెంట‌స్‌తో రొనాల్డోకు నాలుగేళ్ల ఒప్పందం ఉంది. దీంతో ఏటా అత‌ను రూ.478కోట్లు ఆర్జిస్తున్నాడు. సొంత బ్రాండ్ సీఆర్7 ద్వారా దుస్తులు, యాక్సెస‌రీల షాపులు, హోట‌ళ్లు, జిమ్‌లు నెల‌కొల్పుతూ అద‌నంగా మ‌రింత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇక నైక్ కంపెనీతో రొనాల్డోకు జీవిత‌కాల ఒప్పందం ఉంది. దీంతో ఏటా రూ.149 కోట్ల రెమ్యూన‌రేష‌న్ పొందుతున్నాడు.

Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

డాక్ ప్రెస్కాట్‌

ఫోర్బ్స్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న ఆట‌గాడు అమెరికాకు చెందిన ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ డాక్ ప్రెస్కాట్‌. ఏడాది కాలంలో ప్రెస్కాట్ రూ.800 కోట్లు ఆర్జించాడు. ఇటీవ‌ల డ‌ల్లాస్ కౌబాయ్స్‌తో రూ.1197 కోట్ల‌తో ఒప్పందం కుదుర్చుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ డీల్‌తో ప్రెస్కాట్‌కు రూ.299 కోట్ల వార్షిక ఆదాయం రానుంది. స్లీప్ నెంబ‌ర్‌, డైరెక్ట్ టీవీల‌కు అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. వాక్ ఆన్ రెస్టారెంట్ల ప్రాంఛైజీలో 20 శాతం వాటా ఉంది. జోర్డాన్ బ్రాండ్‌తో ఇటీవ‌ల ఐదేళ్ల ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు ప్రెస్కాట్‌.

Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

లెబ్రాన్ జేమ్స్‌

బాస్కెట్‌బాల్ క్రీడాకారుల్లో అమెరికాకు చెందిన లెబ్రాన్ జేమ్స్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అమెరికాలోని నేష‌న‌ల్ బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ (ఎన్‌బీఏ) ఆట‌గాళ్లలో లెబ్రాన్ జేమ్స్ అత్య‌ధిక సంప‌న్నుడు. అత‌డి నిక‌ర ఆదాయం రూ.3741 కోట్లు. గ‌త ఏడాది కాలంలో అత‌ను రూ.718 కోట్లు ఆర్జించి.. ఫోర్బ్స్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఒక్క లాస్ఏంజిల్స్ లేక‌ర్స్‌తో ఒప్పందం వ‌ల్ల ఏటా రూ.281 కోట్లు సంపాదిస్తున్నాడు లెబ్రాన్ జేమ్స్‌. నైక్ షూతో రూ.239 కోట్ల ప్ర‌చార ఒప్పందం ఉంది. ఇవే కాకుండా స్ప్రింగ్ హిల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరున ప్రొడ‌క్ష‌న్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. అన్ఇంట‌రప్టెడ్‌ అనే మీడియా సంస్థ కూడా ఉంది. ఫ్రెండ్స్‌తో క‌లిసి బ్లేజ్ పిజ్జా ఫ్రాంచైజీల‌ను కూడా నెల‌కొల్పాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

ఆమె ఇప్ప‌టికీ జీవించి ఉన్న ఓల్డెస్ట్ ఒలింపిక్ చాంపియ‌న్‌.. ఎవ‌రామె? వ‌య‌సెంత‌?

అబ‌ద్ధాలు ఆపండి.. మీ వ‌ల్ల ప‌డ్డ బాధ‌లు చాలు.. ఆ ఆడియో బ‌య‌ట‌పెట్టిన బోప‌న్న‌

ఈ బెడ్లు శృంగారానికి పనికి రావు

ఇది అవుటా.. నాటౌటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి

లంక ప్లేయ‌ర్‌ను హ‌గ్ చేసుకున్న కృనాల్‌.. ద్ర‌విడ్ ఎఫెక్ట్ అంటున్న నెటిజ‌న్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?
Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?
Forbes list | క‌రోనా టైంలోనూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఎవరంటే?

ట్రెండింగ్‌

Advertisement