e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News ఇది అవుటా.. నాటౌటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి

ఇది అవుటా.. నాటౌటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి

ఇది అవుటా.. నాటౌటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి

హ‌రారె: మీరు క్రికెట్‌లో ఎక్స్‌ప‌ర్టా? ఈ గేమ్‌లో మీకు తెలియందేమీ లేద‌ని అనుకుంటున్నారా? అయితే కింద ఉన్న వీడియో చూసి ఆ బ్యాట్స్‌మ‌న్ అవుటా కాదా చెప్ప‌గ‌ల‌రా? బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ బ్రెండ‌న్ టేల‌ర్ ఇలా ఓ బాల్‌ను ఆడిన త‌ర్వాత త‌న బ్యాట్‌ను అలా వెన‌క్కి తీసుకెళ్ల‌డంతో అది కాస్తా వికెట్లను తాకింది. దీనిపై బంగ్లా ప్లేయ‌ర్స్ అప్పీల్ చేయ‌గా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే దీనిపై సోష‌ల్ మీడియా యూజ‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అసలు ఇది ఎలా అవుట్ అని ప్ర‌శ్నిస్తున్నారు.

క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

- Advertisement -

35.1: అవుట్ హిట్ వికెట్‌
35.1.1: ఓ బౌల‌ర్ చేతి నుంచి బాల్ రిలీజ్ అవ‌డానికి సిద్ధంగా ఉన్న స‌మ‌యంలో స్ట్రైక‌ర్ తానుగానీ, త‌న బ్యాట్‌గానీ వికెట్ల‌ను గిరాటేస్తే అత‌డు/ఆమె హిట్ వికెట్ అవుట్‌.

అయితే ఓ బాల్‌ను ఆడ‌టం పూర్త‌యిన త‌ర్వాత అత‌డు పరుగు కోసం ప్ర‌య‌త్నించ‌కుండానే ఇలా అనుకోకుండా బ్యాట్ లేదా అతడే వికెట్ల‌ను తాకిన సంద‌ర్భంలో అది నాటౌట్‌. గ‌తంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మ‌న్ ఒషానె థామ‌స్ విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది. 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇలా జ‌ర‌గ‌గా.. అంపైర్ అత‌న్ని నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు. అయితే ఈసారి మాత్రం టేల‌ర్‌ను అవుట్ ఇవ్వ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇది అవుటా.. నాటౌటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి
ఇది అవుటా.. నాటౌటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి
ఇది అవుటా.. నాటౌటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి

ట్రెండింగ్‌

Advertisement