T20 Super Strikers : ఇంగ్లండ్ సిరీస్ ముగియడమే ఆలస్యం ఆసియా కప్ (AsiaCup) స్క్వాడ్‌లో ఉండేది ఎవరు?.. అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. పొట్టి క్రికెట్లో అదరగొడుతున్న ఓపెనింగ్ జోడీని మారుస్తారా? సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి శుభ్‌మన్ గిల్(Shubman Gill) కు కెప్టెన్సీ అందిస్తారా?.. ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. ఇక మాజీ క్రికెటర్లు అయితే ఏకంగా ఫలానా ఆటగాళ్లకు చోటు దక్కడం ఖాయమని చెప్పేస్తున్నారు. అయితే.. నిరుడు పొట్టి వరల్డ్ కప్ నుంచి టీ20ల్లో రికార్డుల మోత మోగించింది.. అదిరే స్ట్రయిక్ రేటుతో దడపుట్టించిందిచూస్తే స్క్వాడ్‌లో పక్కాగా ఉండేది ఎవరో తెలిసిపోతుందిగా.
గత ఏడాది కాలంగా పొట్టి ఫార్మాట్లో ఇరగదీస్తున్న భారత కుర్రాళ్లు చాలామందే. కానీ, వీళ్లలో స్ట్రయిక్ రేట్ కింగ్ మాత్రం అభిషేక్ శర్మనే. పొట్టి ఫార్మాట్ అంటే చాలు పూనకాలు వచ్చినట్టు ఆడే ఈ చిచ్చరపిడుగు 193.84 స్ట్రయిక్ రేటుతో ఎవరకీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా తరఫునా దంచేయడమే కాదు పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ రాణిస్తున్నాడు. బెస్ట్ స్ట్రయిక్ రేటులో సంజూ శాంసన్‌ది రెండో స్థానం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజూకు 171.47 స్ట్రయిక్ రేటు ఉంది. మూడో స్థానం మన హైదరాబాదీ తిలక్ వర్మది. ముంబై ఇండియన్స్ తరఫున దుమ్మురేపుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగాడు.
India’s power-hitter supreme! Abhishek Sharma owns the best T20I strike rate (193.84) since World Cup 2024! 💪🇮🇳#AbhishekSharma #T20Is #India #Sportskeeda pic.twitter.com/Gw2Y7u1Xrr
— Sportskeeda (@Sportskeeda) August 17, 2025
తిలక్ 170.66 స్ట్రయిక్ రేటుతో ఆడగా.. టెస్టు ఓపెనర్‌గా స్థిరపడిన యశస్వీ జైస్వాల్ 170.00తో నాలుగో స్థానం సాధించాడు. సిక్సర్ల శివం దూబే 167.12 స్ట్రయిక్ రేటుతో ఐదో ప్లేస్‌లో నిలిచాడు. భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ 161.25 స్ట్రయిక్ రేటుతో ఆరో స్థానంలో ఉండడం గమనార్హం. అయితే.. ఆసియా కప్ కెప్టెన్సీ రేసులో ఉన్న శుభ్‌మన్ గిల్ మాత్రం 129.25 తో అందరికంటే అట్టడుగున 11వ స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్(158.33), రియాన్ పరాగ్(151.42), హార్దిక్ పాండ్యా(145.45), రింకూ సింగ్(138.25)లు గిల్ కంటే ముందున్నారు.