IND vs NZ : పొట్టి క్రికెట్లో భారత జట్టు తమకు తిరుగులేదని చాటుతూ వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లో పంజా విసిరింది. గువాహటిలో ఓపెనర్ అభిషేక్ శర్మ(68 నాటౌట్) శివాలెత్తిపోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(57 నాటౌట్) బౌండరీలతో చెలరేగాడు. వీరిద్దరి విధ్వంసంతో కివీస్ బౌలర్లు కుదేలవ్వగా.. పది ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉఫ్‌మనిపించింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో బ్యాటుతో, బంతితో తేలిపోయిన కివీస్ మూడో ఓటమితో సిరీస్ సమర్పించుకుంది.
స్వదేశంలో పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ భారత జట్టు సిరీస్ విజయంతో రెచ్చిపోయింది. వేదిక మారినా విజయం మాదే అన్నట్టుగా చెలరేగిన టీమిండియా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలుపు గర్జన చేసింది. స్వల్ప ఛేదనలో న్యూజిలాండ్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఓపెనర్ అభిషేక్ శర్మ(68 నాటౌట్) సిక్సర్ల మోత మోగించాడు. పవర్ ప్లేలోనే సంజూ శాంసన్(0), ఇషాన్ కిషన్(28) ఔటైనా.. తన జోరుకు బ్రేకుల్లేవంటూ.. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి లేదంటే స్టాండ్స్‌లోకి పంపాడీ చిచ్చరపిడుగు.
Simply excellent, with 10 overs to spare! 👌
A whirlwind 8⃣-wicket victory for #TeamIndia in Guwahati 🥳
They clinch the #INDvNZ T20I series with an unassailable lead of 3⃣-0⃣ 👏
Scorecard ▶️ https://t.co/YzRfqi0li2@IDFCFIRSTBank pic.twitter.com/zgp3FIz2o4
— BCCI (@BCCI) January 25, 2026
డఫ్పీ వేసిన ఆరో ఓవర్లో 4, 4, 6 తో 14 బంత్లులోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రాయ్‌పూర్‌లో హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్(57 నాటౌట్) తన మార్క్ షాట్లతో విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ పోటాపోటీగా బంతిని బౌండరీకి తరలించగా కివీస్ బౌలర్లు తెల్లమొఖం వేశారు. అగ్నికి వాయువు తోడైనట్టు అభిషేక్ జతగా సూర్య చెలరేగడంతో.. పది ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది భారత్. తద్వారా వరుసగా తొమ్మిదో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.
గువాహటిలో భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు బ్రేకులు వేశారు. భారీ స్కోర్‌తో సిరీస్ కాపాడుకోవాలనుకున్న వారి ప్రయత్నాలకు గండికొడుతూ.. వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. జస్ప్రీత్ బుమ్రా(3-17) విజృంభణకు రవి బిష్ణోయ్(2-18)స్పిన్ మ్యాజిక్ తోడవ్వగా.. కివీస్ హిట్టర్లు తడబడ్డారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన జట్టును గ్లెన్ ఫిలిప్స్(48), మార్చ్ చాప్మన్(32), కెప్టెన్ మిచెల్ శాంట్నర్(27) ఆదుకున్నారు. వీరి మెరుపులతో కోలుకున్న బ్లాక్‌క్యాప్స్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
Innings Break!
Terrific bowling effort by #TeamIndia in Guwahati 👏
Chase coming up shortly⌛
Scorecard ▶️ https://t.co/YzRfqi0li2#INDvNZ | @IDFCFIRSTBank ️ pic.twitter.com/iBxD7a7W0D
— BCCI (@BCCI) January 25, 2026