కోల్‌కతా : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. అతడు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.3 కింద లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు వెల్లడిస్తూ అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఫైన్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. అయితే ఏ విషయంలో అభిషేక్‌పై ఫైన్ వేసినదానిపై మాత్రం గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టతనివ్వలేదు.
ఇదిలాఉండగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్.. తాను ఔట్ అయిన తీరుపై మాత్రం అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు గాను అతడిపై జరిమానా పడినట్టు తెలుస్తున్నది.