Abhishek Sharma : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసక ఆటతో రెచ్చిపోతున్నాడు. పొట్టి ఫార్మాట్లో తానే కింగ్ అని చాటుతూ హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొడుతున్నాడు. కీలకమైన సూపర్ 4 దశలో వరుసగా మూడు అర్ధశతకాలు బాదిన అభిషేక్ ఆసియా కప్ ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొట్టాడు.
చివరి సూపర్ 4 మ్యాచ్‌లో లంకపై తుఫాన్ ఇన్నింగ్స్‌తో 61 రన్స్ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. ఈ మెగా టోర్నీలో 309 రన్స్ చేసిన ఈ డాషింగ్ బ్యాటర్ పాక్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వన్ (Mohammad Rizwan)పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
Stat Alert 🚨 – #TeamIndia opener Abhishek Sharma now has the most runs in a T20 Asia Cup edition 👏👏
He has scored 309 runs so far and becomes the first batter to achieve this feat. pic.twitter.com/xELyd078Kz
— BCCI (@BCCI) September 26, 2025
యూఏఈ వేదికగా 2022లో జరిగిన ఆసియా కప్‌లో రిజ్వాన్ 281 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. అతడి పేరిట ఉన్న ఈ రికార్డును అభిషేక్ తన సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 276 పరుగులతో మూడో స్థానంలో ఉండగా.. అఫ్గనిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ 196 పరుగులతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. హాంకాంగ్ క్రికెటరల్ బాబర్ హయత్ 194 రన్స్‌తో ఐదో స్థానంలో నిలిచాడు.