Honey | తేనెను మనం తరచూ పలు ఆహారాల్లో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. దీన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి లేదా ఇతర పానీయాల్లోనూ కలిపి తీసుకుంటారు. అయితే వాస్తవానికి తేనెను రోజూ తీసుకోవచ్చు. రోజూ ఉదయం పరగడుపునే 1 టీస్పూన్ మోతాదులో తేనెను తీసుకుంటుంటే అనేక లాభాలను పొందవచ్చు. తేనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. సహజసిద్ధంగా తయారైన తేనెను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో కొన్ని రకాల ఎంజైమ్‌లు అలాగే ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. తేనెను రోజూ పరగడుపునే తీసుకోవడం అన్నది పూర్వకాలం నుంచి ఉన్నదే. కానీ ప్రస్తుతం చాలా మంది దీన్ని ఇలా తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే రోజూ తేనెను ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
తేనెను రోజూ తీసుకోవడం వల్ల పిత్తాశయం ఆరోగ్యంగా ఉంటుంది. పైత్య రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. తేనె ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. ఇందులో పలు రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. అందువల్ల తేనెను పరగడుపునే తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. పొట్టలో అధికంగా యాసిడ్లు ఉత్పత్తి అయ్యే వారు, కడుపులో మంట, అజీర్తి, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు రోజూ తేనెను తీసుకుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.
తేనెలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. తేనెలో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని తీసుకుంటే బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అనే సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. కనుక దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. యాక్టివ్‌గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి.
తేనెను ఉదయం తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్న వారు రోజూ తేనెను తీసుకోవడం వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల తేనెను తీసుకుంటే అన్ని రకాల గొంతు సమస్యలను తగ్గించుకోవచ్చు. గొంతులో గరగర, మంట, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే దగ్గు నుంచి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అయితే తేనెను నేరుగా తీసుకోవడంతోపాటు అప్పుడప్పుడు నిమ్మకాయ నీళ్లు లేదా గోరు వెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.