Mahesh Entry | సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్ ట్రాటర్’ (Globetrotter) అనే మెగా ఈవెంట్లో ఈ సినిమా టైటిల్‌తో పాటు, మహేష్ బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టిన మేకర్స్ అనంతరం గ్లింప్స్‌ను విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహేష్ బాబు ఎంట్రీ.
రాజమౌళి ప్రతి సినిమా ఈవెంట్లో హీరో ఎంట్రీని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తారన్న విషయం తెలిసిందే. ‘వారణాసి’ ఈవెంట్లోనూ అదే ట్రెండ్‌ను కొనసాగించారు. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో నటించబోతున్నాడు. దీంతో దానికి తగ్గట్టుగానే ఆయన స్టేజ్ పైకి నందీశ్వరుడి (ఎద్దు) బొమ్మపై కూర్చొని గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఎద్దుపై పరుగెడుతూ, చేతిలో త్రిశూలం పట్టుకుని మహేష్ బాబు చేసిన ఎంట్రీ అభిమానులకు పూనకాలు తెప్పించింది. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఈ ఎంట్రీని ప్లాన్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఎంట్రీ తర్వాత మహేష్ బాబు 40-50 అడుగుల ఎత్తులో క్రేన్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. ఈ మొత్తం ఘట్టం థియేట్రికల్ ఫీల్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో అంటార్కిటికా, వారణాసి, కెన్యా వంటి ప్రదేశాలు, 512 CE నుండి 2027 CE వరకు కాలాలు, అలాగే రామాయణంలోని అంశాలను చూపించడం సినిమా భారీ స్కేల్‌ను తెలియజేస్తుంది.
Babu Entry🥵🥵🥵💥💥💥💥#MaheshBabu #Varanasi #GlobeTrotter
— cinee worldd (@Cinee_Worldd) November 15, 2025