పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తొడ కండరాల గాయంతో ఈనెల 21 నుంచి పెర్త్ వేదికగా జరుగబోయే మొదటి టెస్టుకు దూరం కానున్నాడు.
ఇప్పటికే ఆ జట్టు తొలి టెస్టుకు కెప్టెన్ పాట్ కమిన్స్ సేవలను కోల్పోగా తాజాగా హాజిల్‌వుడ్ సైతం తప్పుకోవడం కంగారూల బౌలింగ్ బలాన్ని దెబ్బతీసేదే. హాజిల్‌వుడ్ స్థానాన్ని బ్రెండన్ డాగెట్ భర్తీ చేయనున్నాడు.