ICC : అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న భారత క్రికెటర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ అవార్డుల్లోనూ సత్తా చాటారు. ప్రతినెలా అందించే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) అవార్డును గెలుచుకున్నారు. సెప్టెంబర్ నెలకు మహిళల విభాగలో స్మృతి మంధాన, పురుషుల విభాగంలో అభిషేక్ శర్మలు ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధించారు. ఆసియా కప్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లకు బహుమతిగా అభిషేక్‌కు.. మూడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రెండు శతకాలతో మెరిసినందుకు మంధానకు ఈ అవార్డు వరించింది.
యూఏఈ వేదికగా జరిగన ఆసియా కప్‌లో అభిషేక్ టీమిండియాకు మెరుపు ఆరంభాలిచ్చాడు. తొలి బంతి నుంచే విధ్వంసానికి తెరతీసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఏడు మ్యాచుల్లో 200 స్ట్రయిక్ రేటుతో ఏకంగా 314 పరుగులు సాధించాడు. దూకుడే మత్రంగా చెలగిపోయిన అభి.. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు’ కోసం నామినేట్ అయిన అభిషేక్ భారత్‌కే చెందిన కుల్దీప్ యాదవ్, బ్రియాన్ బెన్నెట్(జింబాబ్వే)లను తోసిరాజని అవార్డుకు ఎంపికయ్యాడు.
Explosive with the bat and in 🔝 form! 💪
Congratulations to #TeamIndia batter Abhishek Sharma on being named the ICC Men’s Player of the Month for September 2025! 👏👏@IamAbhiSharma4 pic.twitter.com/M1Jri2kjZC
— BCCI (@BCCI) October 16, 2025
‘ఐసీసీ అవార్డు గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. జట్టు విజయాల్లో భాగమైనందుకు నాకు ఈ అవార్డు దక్కినందుకు చాలా సంతోషపడుతున్నా. కష్ట సమయాల్లోనూ గెలపు దిశగా సాగిన జట్టులో భాగమైనందుకు గర్వపడుతున్నా. ఈమధ్య పొట్టి క్రికెట్లో అద్భుత విజయాలకు సానుకూల దృక్ఫథమే కారణం. నాకు ఎంతగానో మద్దతుగా నిలుస్తున్న సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని అభిషేక్ వెల్లడించాడు.
A run machine at the top! 👏
Congratulations to #TeamIndia vice-captain Smriti Mandhana on being named the ICC Women’s Player of the Month for September 2025! 🙌 @mandhana_smriti pic.twitter.com/iOIqwuq0MK
— BCCI Women (@BCCIWomen) October 16, 2025
ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న మంధాన విషయానికొస్తే.. నాలుగు శతకాలతో రికార్డు నెలకొల్పింది. అయితే.. ఆస్ట్రేలియాపై వరుసగా రెండు మ్యాచుల్లోనూ శతకాలతో కదం తొక్కిందీ బ్యాటరు. మూడు వన్డేల సిరీస్‌లో 58, 117, 125 పరుగులతో మెరిసింది మంధా. అందుకే.. ఓటింగ్‌లో దక్షిణాఫ్రికా సంచలనం తంజిమ్ బ్రిట్స్, పాకిస్థాన్ క్రికెటర్ సిద్రా అమిన్లను వెనక్కి నెట్టి అవార్డుకు ఎంపికైందీ స్టయిలిష్ బ్యాటర్.