IND vs SL : ఆసియా కప్ నామమాత్రమైన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(52 నాటౌట్) చెలరేగిపోతున్నాడు. శ్రీలంక బౌలర్లను బెంబేలిత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. తుషార వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు 22 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అభిషేక్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. అంతేకాదు పొట్టి ఫార్మాట్లో 25 బంతుల్లోపే అతడు యాభైకి చేరువవ్వడం ఇది ఆరోసారి. అభిషేక్ విధ్వంసంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 71 రన్స్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఆసియా కప్‌లో వీరకొట్టుడుతో బౌలర్లను వణికిస్తున్న అభిషేక్ శర్మ (52 నాటౌట్) మరోసారి దంచేస్తున్నాడు. చివరిదైన సూపర్ 4 మ్యాచ్‌లో ఈ యంగ్‌స్టర్ ధాటికి లంక బౌలర్లు బిత్తరపోతున్నారు. థీక్షణ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే సిక్సర్‌తో తన దూకుడు చూపించిన అభిషేక్.. తుషారకు వరుసగా రెండు ఫోర్లతో చుక్కలు చూపించాడు.
Abhishek Sharma brings up yet another 5️⃣0️⃣, off 22 balls 👏
His 3rd in a row and 5th in T20Is 🔥
Updates ▶️ https://t.co/xmvjWCaN8L#TeamIndia | #AsiaCup2025 | #Super4 | #INDvSL | @IamAbhiSharma4 pic.twitter.com/6uAbGn6V02
— BCCI (@BCCI) September 26, 2025
శుభ్‌మన్ గిల్ (4) త్వరగానే ఔటైనా తన జోరు మాత్రం తగ్గించలేదు. అనంతరం చమీర ఓవర్లో సిక్సర్‌తో స్కోర్ 50 దాటించాడు. మరో రెండు ఫోర్లతో 15 రన్స్ పిండుకున్నాడీ చిచ్చరపిడుగు. ఆపై తుషారను టార్గెట్ చేస్తూ రెండు ఫోర్లతో 22 బంతుల్లోనే ఫిఫ్టీకి చేరువయ్యాడు. దాంతో, భారత్ పవర్ ప్లేలో 71 పరుగులు చేసింది.