IND vs PAK : పాక్ నిర్ధేశించిన భారీ ఛేదనలో భారత ఓపెనర్లు దంచేస్తున్నారు. తొలి ఓవర్ నుంచే దూకుడు కనబరిచిన అభిషేక్ శర్మ(33), శుభ్‌మన్ గిల్(35)లు బౌండరీలతో హోరెత్తిస్తున్నారు. దాంతో.. స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో పరుగులు తీస్తోంది. ఆయూబ్ వేసిన 6వ ఓవర్లో అభి ఒక ఫోర్.. గిల్ రెండు బౌండరీలతో 14 రన్స్ పిండుకున్నారు. దాంతో. పవర్ ప్లేలో భారత్ వికెట్ కోల్పోకుండా 69 రన్స్ చేసింది.
షాహీన్ అఫ్రిది వేసిన తొలి బంతినే ఫైన్ లెగ్ దిశగా సిక్సర్‌గా మలిచాడు అభిషేక్ శర్మ(33). అనంతరం శుభ్‌మన్ గిల్(35) సైతం దూకుడుగా ఆడాడు. అబ్రార్ వేసిన నాలుగో ఓవర్లో మిడ్ వికెట్ దిశగా వరుసగా 4, 6 కొట్టగా స్కోర్ 40 దాటింది. రవుఫ్‌ను ఉతికేస్తూ అభిషేక్ బాదగా 28 బంతుల్లోనే ఈ ద్వయం భాగస్వామ్యం 50 రన్స్‌కు చేరింది. చివరి బంతిని గిల్ మెరుపు వేగంతో బౌండరీకి తరలించాడు. ఆయూబ్ బౌలింగ్‌లో మెరుపు బౌండరీతో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడీ లెఫ్ట్ హ్యాండర్.
FIFTY!
Abhishek Sharma brings up a fantastic half-century off just 24 deliveries.
His third in T20Is 👏🔥
Live – https://t.co/XXdOskvd5M #AsiaCup2025 #Super4 pic.twitter.com/IJtM0H8DEU
— BCCI (@BCCI) September 21, 2025