IND vs SL : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(61) తనకు అలవాటైన తీరుగా బౌండరీలతో చెలరేగిపోగా టీమిండియా భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ(49 నాటౌట్), సంజూ శాంసన్(39)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. డెత్ ఓవర్లలో శాంసన్, పాండ్యా వెంట వెంటనే ఔట్ అయినా.. అక్షర్ పటేల్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. చమీర వర్లో ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి జట్టు స్కోర్ 200 దాటించాడు. దాంతో.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
సూపర్ 4 లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంకకు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అభిషేక్ శర్మ(61), మిడిలార్డర్ రాణించడంతో కొండంత స్కోర్ కొట్టింది. శుభ్‌మన్ గిల్(4) రెండో ఓవర్లోనే ఔటైనా.. భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ పవర్ ప్లేలో లంక బౌలర్లను బెంబేలిత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తుషార వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు 22 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అభిషేక్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. అతడి విధ్వంసంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 71 రన్స్ చేసింది.
Innings Break!
A comprehensive batting display as #TeamIndia post a strong 202/5, the highest total of the #AsiaCup2025
Scorecard – https://t.co/OVolZNi5K7 #INDvSL #AsiaCup2025 #Super4 pic.twitter.com/5dW7cVIA9W
— BCCI (@BCCI) September 26, 2025
ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ సూర్య మరోసారి విఫలమయ్యాడు. పవర్ ప్లే తర్వాతి ఓవర్లో అతడిని హసరంగ ఎల్బీగా ఔట్ చేశాడు. అసలంకను టార్గెట్ చేయబోయి అభిషేక్ సైతం వెనుదిరిగాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (39)., తిలక్ వర్మ(49 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
A fine fifty run partnership comes up between Tilak Varma and Sanju Samson 🤝
Live – https://t.co/OVolZNi5K7 #INDvSL #AsiaCup2025 #Super4 pic.twitter.com/mlX9BAJMJe
— BCCI (@BCCI) September 26, 2025
హసరంగ ఓవర్లో సంజూ స్ట్రెయిట్ సిక్సర్ సంధించగా 15 ఓవర్లకే స్కోర్ 150 చేరింది. కానీ, చమీర ఓవర్లో హార్దిక్ పాండ్యా(2) పెద్ద షాట్‌కు యత్నించగా.. గాల్లోకి లేచిన బంతిని చమీర పరుగెత్తుతూ వెళ్లి అందుకున్నాడు. అయినా సరే.. తిలక్ జోరు కొనసాగించాడు. అక్షర్ పటేల్(21 నాటౌట్)తో కలిసి అజేయంగా ఆరో వికెట్‌కు 40 రన్స్ జోడించాడు. ఫలితంగా 20 ఓవర్లలో భారత్ 202 పరుగులు చేసింది.