IND vs Oman : చివరి లీగ్ మ్యాచ్‌లో దంచేస్తారనుకుంటే భారత జట్టు ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. పవర్ ప్లేలో వరుసగా బౌండరీలతో అలరించిన అభిషేక్ శర్మ(31) వికెట్ కీపర్ వినాయక శుక్లాకు దొరికిపోయాడు. జితెన్ రమాదిన్ ఓవర్లో నాన్‌స్ట్రయికర్ హార్దిక్ పాండ్యా(1) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. దాంతో.. టీమిండియా 71 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయినా.. సంజూ శాంసన్ (37 నాటౌట్), అక్షర్ పటేల్(10 నాటౌట్) ధనాధన్ ఆడడంతో స్కోర్ 10 ఓవర్లకే 100కు చేరింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(5) తొలి ఓవర్లో బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ, షాహ్ ఫైజల్ వేసిన రెండో ఓవర్లో బంతిని అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (37 నాటౌట్) జతగా ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ(31). తనదైన పవర్ హిట్టింగ్ చేసిన అభి.. షకీల్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 16 రన్స్ పిండుకున్నాడు.
We are at the halfway mark and #TeamIndia have put on 100-3 on the board. Sanju Samson (37*) has hit some delightful shots and Axar is batting on 10. https://t.co/f821Q2KeZt #INDvOMA #AsiaCup2025 pic.twitter.com/FRunhcTzu9
— BCCI (@BCCI) September 19, 2025
నదీమ్‌ను ఉతికేస్తూ.. మూడు ఫోర్లతో విరుచుకుపడ్డాడీ లెఫ్ట్ హ్యాండర్. పవర్ ప్లే ఆఖరి బంతికి అతడు సిక్సర్ కొట్టడంతో స్కోర్ 60కి చేరింది. సంజూ సైతం గేర్ మార్చి ఏడో ఓవర్లో సిక్స్, ఫోర్‌తో రెచ్చిపోయాడు. అయితే.. రమాదిన్ ఓవర్లో బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లో పడడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అదే ఓవర్లో శాంసన్ ఆడిన బంతిని బౌలర్ రమాదిన్ చేతుల్ని తాకుతూ వికెట్లను గిరాటేయగా పాండ్యా నిరాశగా పెవిలియన్ చేరాడు.