IND vs NZ : ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో భారత జట్టు అదిరే బోణీ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(84) విధ్వంసక ఆటకు శివం దూబే(2-28), వరుణ్ చక్రవర్తి(2-37) విజృంభణ తోడవ్వగా.. న్యూజిలాండ్‌పై భారీ విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో వన్డే సిరీస్ హీరోలు గ్లెన్ ఫిలిప్స్(78) హీరో మిచెల్ మార్ష్(28)లు పోరాడినా గెలిపించలేకపోయారు. 48 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిఈరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టీ20ల్లో తిరుగులని టీమిండియా స్వదేశంలో మరో సిరీస్‌ను విజయతో ఆరంభించింది. వన్డే సిరీస్ విజయోత్సాహంతో నాగ్‌పూర్‌లో చెలరేగాలనుకున్న న్యూజిలాండ్‌కు సూర్యకుమార్ యాదవ్ సేన బిగ్ షాకిచ్చింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(84) పవర్ హిట్టింగ్‌కు, రింకూ సింగ్(44 నాటౌట్) మెరుపులు తోడవ్వగా 238 కొట్టిన టీమిండియా.. అనంతరం ప్రత్యర్థిని 190కే కట్టడి చేసి సిరీస్‌లో ముందంజ వేసింది.
This team is such a joy to watch.
Full of aate hee kaam shuru kar diye energy. Well played 👏👏 #INDvNZ pic.twitter.com/KqPm31jsIO— Wasim Jaffer (@WasimJaffer14) January 21, 2026
భారీ ఛేదనలో ఆరంభంలోనే న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. అర్ష్‌దీప్ సింగ్ మొదటి ఓవర్లోనే డెవాన్ కాన్వే(0)ను ఔట్ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఓవర్లో రచిన్ రవీంద్ర(1) వెనుదిరగడంతో 2 పరుగులకే రెండు వికెట్లు పడిన వేళ టిమ్ రాబిన్సన్(21), గ్లెన్ ఫిలిప్స్(78) వికెట్ కాపాడుకున్నారు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పినా ఈ జోడీని వరణ్ చక్రవర్తి విడదీశాడు.
✌️ wickets in the last over 👏
Shivam Dube finishes #TeamIndia‘s bowling effort in fine fashion 🙌
Updates ▶️ https://t.co/ItzV352h5X#INDvNZ | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/tICsYGqTuN
— BCCI (@BCCI) January 21, 2026
అనంతరం మార్క్ చాప్మన్(39) జతగా ఫిలిప్స్ పెద్ద షాట్లు ఆడి స్కోర్ 130 దాటించాడు. ప్రమాదకరంగా మారిన ఈ ఇద్దరిని అక్షర్, వరుణ్ పెవిలియన్ పంపారు. వెంటవెంటనే ఇద్దరూ ఔట్ కావడంతో బ్లాక్‌క్యాప్స్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ఆఖర్లో డారిల్ మిచెల్(28), కెప్టెన్ శాంట్నర్(20 నాటౌట్) పోరాడారు. శివం దూబే(2-28) ఆఖరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మార్ష్ డగౌట్ చేరాడు. తర్వాతి బంతికే క్లార్కే(0) రింకూ చేతికి చిక్కగా కివీస్ 190కే పరిమితమైంది.
పొట్టి సిరీస్ తొలి మ్యాచ్‌లోనే భారత బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(84)విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. రింకూ సింగ్(44 నాటౌట్) తనమార్క్ స్ట్రోక్ ప్లేతో రెచ్చిపోయాడు. ఓపెనర్లు విఫలైమనా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32) తో కలిసి మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు అభిషేక్. డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా(25), రింకూలు బ్యాట్ ఝులిపించగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 238 రన్స్ కొట్టింది.
Going, going, GONE! 🚀
🎥 Rinku Singh with a fabulous final flourish to power #TeamIndia to 2⃣3⃣8⃣/7 👏
Scorecard ▶️ https://t.co/ItzV352h5X#INDvNZ | @IDFCFIRSTBank | @rinkusingh235 pic.twitter.com/BGTv4m3NxD
— BCCI (@BCCI) January 21, 2026