IND vs BAN : సూపర్ 4 రెండో మ్యాచ్‌లో శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది భారత్. ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), శుభ్‌మన్ గిల్(29)లు ధనాధన్ ఆడి భారీ స్కోర్‌కు గట్టి పునాది వేసినా.. మిడిలార్డర్ తేలిపోయింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు పడడంతో స్కోర్ వేగం తగ్గింది. పవర్ ప్లే తర్వాత అభిషేక్ తనదైన స్టయిల్లో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (38) మెరుపు షాట్లతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది సూర్యకుమార్ సేన.
ఆసియా కప్ సూపర్ 4 తొలి పోరు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత జట్టు రెండో మ్యాచ్‌లోనూ ఓపెనర్ అభిషేక్ శర్మ(60 నాటౌట్) విధ్వంసంతో పోరాడగలిగే స్కోర్ చేసింది. తొలి మూడు ఓవర్లలో స్కోర్ 17 మాత్రమే. కానీ, సైఫుద్దీన్ ఓవర్లో నాలుగు ఫోర్లతో అభిషేక్ రెచ్చిపోవడంతో పవర్ ప్లేలో ముగిసే సరికి స్కోర్ 72కు చేరింది. ఈ క్రమంలోనే ఈ లెఫ్ట్ హ్యాండర్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన శుభ్‌మన్ గిల్ (29).. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన శివం దూబే(2)లు త్వరగా ఔటయ్యారు. దాంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(3)తో జట్టుకు భారీ స్కోర్ అందించాలనుకున్నాడీ యంగ్‌స్టర్. దాంతో.. టీమిండియా 200 కొడుతుందనిపించింది.
Innings Break!
A 75-run blitz from Abhishek Sharma propelled #TeamIndia to 168/5 ⚡️⚡️
Over to our bowlers 🤝
Updates ▶️ https://t.co/bubtcR19RS#AsiaCup2025 | #Super4 pic.twitter.com/DVbwETgjbp
— BCCI (@BCCI) September 24, 2025
కానీ, ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో అభిషేక్ అనూహ్యంగా రనౌట్ కాగా.. చివరి బంతికి జకీర్ అలీ డైవింగ్ క్యాచ్‌తో సూర్య కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత.. హార్దిక్ పాండ్యా(38), తిలక్ వర్మ(5)లు.. ఐదో వికెట్‌కు 15 రన్స్ జోడించారంతే. అక్షర్ పటేల్(10 నాటౌట్) అండగా ధనాధన్ ఆడిన పాండ్యా.. గ్యాప్‌లో పవర్ ఫుల్ షాట్లు కొడుతూ బౌండరీలు రాబట్టాడు. కానీ, చివరి ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్‌కు యత్నించి బౌండరీ వద్ద దొరికిపోయాడు. దాంతో.. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
Whenever the team is in trouble, there is only one person who stands up for his team.
– Salute to you Pandya 🔥 🫡 #INDvsBAN #AsiaCup2025pic.twitter.com/PGjl5FNFJS
— bhanu🇮🇳 (@Bhanu_R780) September 24, 2025