Team India | ముంబై: దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. శుక్రవారం భేటీ అయిన సెలెక్షన్ కమిటీ ఓవైపు యువకులతో కూడిన జట్టుతో పాటు ఆసీస్ టెస్టు సిరీస్‌కు అనుభవానికి పెద్దపీట వేసింది. ఇటీవలే టీ20ల్లో ఇరుగదీసిన తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.
ఆసీస్‌లోని పేస్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకున్న సెలెక్టర్లు ఆల్‌రౌండర్ నితీశ్ వైపు మొగ్గుచూపారు. ఇప్పటికే ఆసీస్ ‘ఎ’తో సన్నాహక మ్యాచ్‌ల కోసం భారత్ ‘ఎ’ తరఫున నితీశ్ బరిలోకి దిగుతున్నాడు. మిగతా ప్లేయర్ల విషయానికొస్తే…ఫామ్‌మీదున్న సర్ఫరాజ్ఖాన్తో పాటు అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్, జురెల్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
గాయం కారణంగా స్పిన్నర్ కుల్దీప్యాదవ్ను పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో రమణ్‌దీప్‌సింగ్, విజయ్‌కుమార్, యశ్ దయాల్ చోటు దక్కించుకున్నారు.