AB de Villiers : దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(AB de Villiers), విరాట్ కోహ్లీ (Virat Kohli) మంచి మిత్రులనే విషయం తెలిసిందే. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)జట్టుకు ఆడిన సమయంలో బలపడిన వీళ్ల స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే.. 18వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌ను గ్యాలరీలో ఉండి వీక్షించాడు డివిలియర్స్. ఆర్సీబీ విజేతగా అవతరించగానే ఆటగాళ్ల సంబురాలను ఫోన్లో బంధించిన అతడు.. ఆ తర్వాత విరాట్ కోహ్లీని హత్తుకొని అభినందించాడు. అయితే.. ఇప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్న తమ మధ్య కొన్ని నెలల పాటు అసలు మాటలే లేవని చెప్పాడీ సఫారీ మాజీ కెప్టెన్. అందుకు కారణం ఏంటో కూడా వివరించాడు.
‘కోహ్లీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరం పలు విషయాలు షేర్ చేసుకునేవాళ్లం. ఈ క్రమంలోనే కుటుంబ విషయాలు కూడా చర్చించుకునేవాళ్లం. దాంతో, నేను 2024 ఫిబ్రవరిలో యూట్యూబ్ లైవ్‌లో పొరపాటున అతడు రెండోసారి తండ్రికాబోతున్నాడనే వార్తను అందరితో పంచుకున్నాను. దాంతో, విరాట్‌కు బాగా కోపం వచ్చినట్టుంది. అప్పటి నుంచి అతడు నాతో మాట్లాడడం మానేశాడు.
AB de Villiers reveals Virat Kohli had stopped talking to him for a while after the former South African captain inadvertently revealed the reason behind the India star skipping the home Test series against England. pic.twitter.com/ywqkLfj887
— Circle of Cricket (@circleofcricket) June 15, 2025
రోజులు కాదు.. నెలల తరబడి మా మధ్య మాటల్లేవు. అయితే.. ఆరు నెలల క్రితం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (BGT) సమయంలో కోహ్లీ నాకు ఫోన్ చేశాడు. అలా మళ్లీ మా మధ్య మిటలు మొదలయ్యాయి’ అని మాజీ మిస్టర్ 360 వెల్లడించాడు.
తమ మధ్య అగాధానికి తెరపడడంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు భారత్‌కు వచ్చాడు డివిలియర్స్. అహ్మదాబాద్ స్టేడియంలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పోరును ఆస్వాదిస్తూ కనిపించిన అతడు.. బెంగళూరు కప్ గెలవగానే సంతోషం పట్టలేకపోయాడు. ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ గేల్(Chris Gayle)తో కలిసి కోహ్లీని అభినందించిన డివిలియర్స్.. విక్టరీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. రెండు రోజుల క్రితం లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా టెస్టు గద(Test Mace)ను ముద్దాడిన క్షణాల్ని సైతం ఫోన్లో బంధిస్తూ కెమెరాకు చిక్కాడు డివిలియర్స్.
Photo of the day: Royal Challengers Bengaluru’s Virat Kohli, along with his former teammates AB de Villiers and Chris Gayle, celebrates with the trophy after winning the final match of the Indian Premier League (IPL) Twenty20 against Punjab Kings at the Narendra Modi Stadium in… pic.twitter.com/d8O4X5OSeM
— Forbes India (@ForbesIndia) June 4, 2025