AB de Villiers : ప్రపంచ క్రికెట్లో మిస్టర్ 360గా పేరొందిన ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఎన్నో చిరస్మరణీయి ఇన్నింగ్స్‌లు ఆడాడు. వీడ్కోలు అనంతరం కూడా అతడి ఆటను అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం తమ దేశానికి చెందిన టీ20 లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న డివిలియర్స్‌కు ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్’ (ICC Hall Of Fame)లో చోటు దక్కిన విషయం తెలిసిందే.
క్రికెట్‌కు విశేష సేవలు అందించడంతో పాటు ఎనలేని గుర్తింపు తెచ్చినందుకు అతడికి ఆ గౌరవం దక్కింది. ఐసీసీ నుంచి అరుదైన గౌరవం సొంతం కావడంతో పట్టలేనంత సంతోషంలో ఉన్న డివిలియర్స్ గురువారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. తనకు ఐసీసీ బహూకరించిన హాల్ ఆఫ్ ఫేమ్ టోపీ ఫ్రేమ్ ఫొటోలను డివిలియర్స్ అభిమానులతో పంచుకున్నాడు.
Thank you for this, @ICC. This is special. And thank you to the game that has given me so many wonderful memories, and so much love from across this beautiful planet. ♥️ pic.twitter.com/farbaJ20pN
— AB de Villiers (@ABdeVilliers17) October 24, 2024
‘ఈ బహుమతి ఇచ్చినందుకు ఐసీసీకి ధన్యవాదాలు. ఇది నాకు చాలా ప్రత్యేకం. నాకు ఎన్నో అద్భుతమైన జ్జాపకాలను మిగిల్చినందుకు, ఈ అందమైన ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో ప్రేమను నాకు అందించినందుకు క్రికెట్‌కు ధన్యవాదాలు’ అని డివిలియర్స్ క్యాప్షన్ రాశాడు. భారత మహిళల జట్టు మాజీ క్రికెటర్ నీతూ డేవిడ్, ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్‌లు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.