తిరుమల : తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) గురువారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య, కుమారుడితో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయాధికారులు సాదర స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం బయట దిల్రాజు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగడానికి పోటి పడ్డారు. ప్రస్తుతం దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ప్రముఖ సినీనటుడు , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోదరుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) గురువారం తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని రామకృష్ణ దర్శించుకోనున్నారు.