Aasif Sheikh | భారత్‌పై హాఫ్ సెంచరీ కొట్టిన తొలి నేపాల్ క్రికెటర్.. రెండేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగిండు
Aasif Sheikh : ఆసియా కప్(Asia cup 2023)లో నేపాల్ క్రికెటర్ ఆసిఫ్ షేక్(Aasif Sheikh) అరుదైన ఫీట్ సాధించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పేరొందిన ఈ యంగ్‌స్టర్ టీమిండియా(Team India)పై అర్ధ శతకం బాదాడు. దాంతో, భారత్‌పై అర్థ శతకం బాదిన తొలి నేపాల్ ఆటగాడి(First Nepal Cricketer)గా రికార్డుల్లోకెక్కాడు. పల్లెకెలె స్టేడియంలో ఈరోజు ఆసిఫ్ 88 బంతుల్లో 7 ఫోర్లతో...
Aasif Sheikh : ఆసియా కప్(Asia cup 2023)లో నేపాల్ క్రికెటర్ ఆసిఫ్ షేక్(Aasif Sheikh) అరుదైన ఫీట్ సాధించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పేరొందిన ఈ యంగ్‌స్టర్ టీమిండియా(Team India)పై అర్ధ శతకం బాదాడు. దాంతో, భారత్‌పై అర్థ శతకం బాదిన తొలి నేపాల్ ఆటగాడి(First Nepal Cricketer)గా రికార్డుల్లోకెక్కాడు. పల్లెకెలె స్టేడియంలో ఈరోజు ఆసిఫ్ 88 బంతుల్లో 7 ఫోర్లతో ఫిఫ్టీ బాదాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో 58 పరుగుల వద్ద ఔటయ్యాడు. సిరాజ్ ఓవర్లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టడంతో ఆసిఫ్ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
వికెట్ కీపర్, బ్యాటర్ అయిన ఆసిఫ్ 2021లో నేపాల్ జాతీయ జట్టులోకి వచ్చాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో పపువా న్యూగినియా(Papua New Guinea)పై తొలి మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది అనూహ్యంగా అదే జట్టుపై వన్డేల్లో మొదటి శతకం బాదాడు. జట్టులోకి వచ్చిన రెండేళ్లలోనే ఆసిఫ్ కీలక ఆటగాడిగా ఎదిగాడు. నేపాల్ జట్టు తొలిసారి ఆసియా కప్ పోటీలకు అర్హత సాధించడంలో అతడి పాత్ర ఎంతో ఉంది. ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అతను పాకిస్థాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 26 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
🏏Nepal vs India 🔥
Aasif lifts his bat as he scores 50 off 88 balls with seven 4s🌟#weCAN #AsiaCup2023 pic.twitter.com/4XyAZsAKUI— CAN (@CricketNep) September 4, 2023
ఈపీఎల్ ఫైనల్లో సెంచరీ
కుడి చేతివాటం బ్యాటర్ అయిన ఆసిఫ్ అండర్ -19 జట్టు(Under -19) తరఫున కూడా అదరగొట్టాడు. అంతేకాదు 2016లో జరిగిన ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్(Everest Premier League 2016)లో దుమ్మురేపాడు. ఫైనల్లో సెంచరీ(111 నాటౌట్)తో కదం తొక్కి జట్టుకు తొలి ఈపీఎల్ ట్రోఫీ అందించాడు.
ఈపీఎల్ ఫైనల్లో సెంచరీ బాదిన ఆసిఫ్

అంతేకాదు ఆరు మ్యాచుల్లో 44 సగటుతో 202 రన్స్ చేసిన అతను టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2021లో జరిగిన ప్రైమ్ మినిస్టర్ కప్(Prime Minister Cup)లో ఆసిఫ్ 206 పరుగులతో రాణించాడు.
క్రీడా స్ఫూర్తికి అవార్డు
ఆసిఫ్ తన ఆటతోనే కాకుండా మైదానంలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. నిరుడు ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ జరిగింది. ఐర్లాండ్ ఆటగాడు ఆండీ మెక్‌బ్రిన్(Andy McBrine) రన్ తీసే ప్రయత్నంతో కింద పడిపోయాడు. అప్పటికే ఫీల్డర్ విసిరిన బంతిని అందుకున్న ఆసిఫ్ అతడిని రనౌట్ చేయలేదు.
A heart-warming #SpiritOfCricket moment from Nepal’s wicket-keeper Aasif Sheikh 👏
Follow the upcoming T20 World Cup Qualifier A live on @FanCode and https://t.co/CPDKNxoJ9v (in select regions).
All you need to know 👉 https://t.co/XQgeYSj7Z7 pic.twitter.com/1JoX7qRube
— ICC (@ICC) February 16, 2022
దాంతో, స్టేడియంలోని అభిమానులంతా ఆసిఫ్‌కు జేజేలు పలికారు. ఆ మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు 2022 సంవత్సరానికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్(2022 ICC Spirit of Cricket Award) అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Brazil Footballer | ఆ క్లబ్లో మెస్సీ, నేను నరకం చూశాం.. షాకింగ్ విషయాలు చెప్పిన నెయ్మర్
US Open 2023 | 16వ రౌండ్లో ఓటమి.. నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన మాజీ చాంపియన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

