Brazil Footballer | ఆ క్లబ్లో మెస్సీ, నేను నరకం చూశాం.. షాకింగ్ విషయాలు చెప్పిన నెయ్మర్
Brazil Footballer : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్ జూనియర్(Neymar Jr) మాజీ క్లబ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్(PSG club Germany)కు ఆడిన సమయంలో లియోనల్ మెస్సీ(Lionel Messi), తాను నరకం చూశామని బాంబ్ పేల్చాడు. 2022-23 చాంపియన్స్ లీగ్ వైఫల్యం కారణంగా మెస్సీ, తనను పీఎస్జీ యాజమాన్యం చాలా ఇబ్బందులకు గురి చేసిందని..
Brazil Footballer : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్ జూనియర్(Neymar Jr) మాజీ క్లబ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్(PSG club Germany)కు ఆడిన సమయంలో లియోనల్ మెస్సీ(Lionel Messi), తాను నరకం చూశామని బాంబ్ పేల్చాడు. 2022-23 చాంపియన్స్ లీగ్ వైఫల్యం కారణంగా పీఎస్జీ యాజమాన్యం మెస్సీ, తనను చాలా ఇబ్బందులకు గురి చేసిందని నెయ్మర్ తెలిపాడు. ‘ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో కలిసి ఆడడం ఎంతో సంతోషంగా అనిపించింది. అదే సమయంలో బాధగానూ ఉండేది. ఎందుకంటే.. నిరుడు అర్జెంటీనాకు అర్టెంటీనాకు వరల్డ్ కప్(FIFA World Cup 2022) అందించిన మెస్సీ పీఎస్జీకి వచ్చాక గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.
మా క్లబ్ తరఫున మునపటిలా చెలరేగలేకపోయాడు. దాంతో, అందరం నిరాశ చెందాం. అయితే.. మేము ఉన్నదే అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు. కానీ, చాంపియన్స్ లీగ్‌లో అది సాధ్యం కాలేదు. అందువల్ల యాజమాన్యం మాతో దురుసుగా వ్యవహరించింది. చెప్పాలంటే పీఎస్జీ క్లబ్‌తో ఉన్న చివరి రోజులు మెస్సీ, నేను నరకం చూశాం’ అని నెయ్మర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంతో బాధతో మెస్సీ పీఎస్జీని వీడాడని ఈ బ్రెజిల్ స్టార్ తెలిపాడు. ఫుట్‌బాల్ ఆటకు అనర్హుడిని అనే భావనతో మెస్సీ పీఎస్జీను వీడాడు. అయితే.. అతడి ఎంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. అతను గొప్ప శిక్షకుడు మాత్రమే కాదు నిజమైన పోరాట యోధుడు అని నెయ్మర్ వెల్లడించాడు.
లియోనల్ మెస్సీ, కిలియన్ ఎంబాపే

ఫిఫా వరల్డ్ కప్ తర్వాత మెస్సీ, నెయమర్, కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) పీఎస్జీ తరఫున సౌదీ ప్రో లీగ్(Soudi Pro League )లో ఆడారు. అయితే.. ఆ క్లబ్‌తో రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియడంతో మెస్సీ ఈమధ్యే ఇంటర్ మియామి(Inter Miami)కి మారాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al-Hilal) క్లబ్‌తో నెయ్మర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎంబాపే కూడా కొత్త క్లబ్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ, పీఎస్జీ యాజమాన్యం అతడితో మాట్లాడి తమతోనే కొనసాగేలా ఒప్పించింది.
ఇవి కూడా చదవండి
US Open 2023 | 16వ రౌండ్లో ఓటమి.. నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన మాజీ చాంపియన్
Rishabh Pant | కమ్ బ్యాక్ కోసం చెమటోడ్చుతున్న పంత్.. ఎంత కష్టపడుతున్నాడో చూడండి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

