Aamir Kaleem : ఒమన్ బ్యాటర్ అమిర్ కలీం(Aamir Kaleem) సంచలన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అబుదాబీ మైదానంలో భారత బౌలర్లను చితక్కొడుతూ హాఫ్ సెంచరీ బాదేశాడీ చిచ్చరపిడుగు. శివం దూబే వేసిన ౧15వ ఓవర్లో ఫోర్, సిక్సర్ బాదిన కలీం 38 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్ను ఈ రైట్ హ్యాండర్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ సాధించాడు. తద్వారా ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అర్ధ శతకం కొట్టిన అతిపెద్ద వయస్కుడిగా కలీం రికార్డు నెలకొల్పాడు.
టీమిండియాపై చివరి లీగ్ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో కలీం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. పొట్టి ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో హాఫ్ సెంచరీ బాదిన అతిపెద్ద వాడిగా నిలిచాడు. ఈరోజుకు అతడి వయసు 43 ఏళ్ల 330 రోజులు. దాంతో.. అఫ్గనిస్థాన్ మాజీ కెప్టెన్, 40 ఏళ్ల మొహ్మమ్మద్ నబీ (40 ఏళ్ల 260 రోజులు) రెండో స్థానానికి పడిపోయాడు.
43-year-old Aamir Kaleem brings up a brilliant fifty 👏#INDvOMA LIVE ▶️ https://t.co/AMBIZU5uoM pic.twitter.com/7CALXxyqbY
— ESPNcricinfo (@ESPNcricinfo) September 19, 2025
గత మ్యాచ్‌లో శ్రీలంకపై సిక్సర్ల మోతతో ఫిఫ్టీ సాధించాడీ ఆల్‌రౌండర్. లంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ 39 ఏళ్ల 142 రోజుల వయసులో అసియా కప్‌లో అర్ధ శతకం నమోదు చేశాడు. అతడు 2016లో మిర్పూర్లో పాకిస్థాన్‌పై ఈ ఘనతకు చేరుకున్నాడు.