శనివారం 23 జనవరి 2021
Sports - Nov 29, 2020 , 12:54:47

బాబ‌ర్ న‌న్ను మోసం చేశాడు.. పాక్ కెప్టెన్‌పై మ‌హిళ ఆరోప‌ణ‌లు

బాబ‌ర్ న‌న్ను మోసం చేశాడు.. పాక్ కెప్టెన్‌పై మ‌హిళ ఆరోప‌ణ‌లు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ క్రికెట్‌లో మ‌రో కుదుపు. ఆ టీమ్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ త‌న‌ను మోసం చేశాడ‌ని ఓ మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. పెళ్లి చేసుకుంటాన‌ని చె్పి ప‌దేళ్ల పాటు త‌న‌ను లైంగికంగా అనుభ‌వించాడ‌ని ఆ మ‌హిళ ఆరోపించింది. అత‌ని వ‌ల్ల తాను గ‌ర్భం దాల్చాన‌ని చెప్పింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెప్పొద్ద‌ని బాబ‌ర్ త‌న‌ను బెదిరించాడ‌ని తెలిపింది. సాజ్ సాదిక్ అనే జ‌ర్న‌లిస్ట్ ఆ మహిళ ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్న వీడియోను ట్వీట‌ర్‌లో షేర్ చేశాడు. బాబ‌ర్ త‌న‌ను కొట్టాడ‌ని కూడా ఆ మ‌హిళ చెబుతోంది. క్రికెట్‌తో సంబంధం లేని రోజుల నుంచీ బాబ‌ర్ నాకు తెలుసు. అత‌ను ఓ పేద కుటుంబం నుంచి వ‌చ్చాడు. మేమిద్ద‌రం ఒకే కాల‌నీలో ఉండేవాళ్లం అని ఆమె చెప్పింది. 2010లోనే అత‌డు త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ని తెలిపింది. తాను కూడా అందుకు అంగీక‌రించాన‌ని, అయితే త‌మ కుటుంబాలు మాత్రం పెళ్లికి అంగీక‌రించ‌లేద‌ని ఆ మ‌హిళ వెల్ల‌డించింది. 2011లో తాము ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయామ‌ని, అప్ప‌టి నుంచీ అక్క‌డ‌క్క‌డా ఇల్లు అద్దెకు తీసుకొని తాము క‌లిసే ఉండేవాళ్ల‌మ‌ని తెలిపింది. అయితే పెళ్లి చేసుకుందామ‌ని ఎప్పుడు అడిగినా.. ఇప్పుడు ఆ ప‌రిస్థితుల్లో తాను లేన‌ని అత‌డు చెప్పే వాడ‌ని ఆ మ‌హిళ చెబుతోంది. 2016లో తాను గ‌ర్భం దాల్చిన‌ప్ప‌టి నుంచీ బాబర్ పూర్తిగా మారిపోయాడ‌ని ఆమె చెప్పింది. ఈ ఆరోప‌ణ‌ల‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా స్పందించ‌లేదు. బాబ‌ర్ ఆజం ప్ర‌స్తుతం పాక్ టీమ్‌తో క‌లిసి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. 


logo