మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 5 : రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మహబూబ్‌నగర్ బాలబాలికల జట్లు టైటిల్ విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ బాలురు, ఖమ్మం బాలికల జట్లు రన్నరప్‌గా నిలిచాయి. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాలలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న అండర్-17, అండర్-19 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారంతో ముగిశాయి. విజేత జట్లకు శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, డీఈవో రవీందర్ షీల్డులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు, నగదు అందజేశారు.