NZ vs PAK: అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం ఆస్ట్రేలియాకు వచ్చిన పాకిస్తాన్.. కొత్త సారథి షాన్ మసూద్ (టెస్టులకు) ఆడిన మూడు టెస్టులలోనూ ఓడి క్లీన్ స్వీప్‌ను మూటగట్టుకుంది. అక్కడ్నుంచి నేరుగా న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడా మరో కొత్త సారథి షహీన్ షా అఫ్రిది (టీ20లకు) నేతృత్వంలోనూ ఆ జట్టు రాత మారలేదు. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ముగిసిన నాలుగో మ్యాచ్‌లోనూ పాక్ చిత్తుగా ఓడింది. గత 14 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ఇది 12 పరాభవం కాగా.. వరుసగా 8వ ఓటమి కావడం గమనార్హం. తాజా మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని కివీస్.. 18.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా సిరీస్‌లో కివీస్ 4-0 ఆధిక్యం సాధించింది.
క్రిస్ట్‌చర్చ్‌లోని హగ్లే ఓవల్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో.. 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. 63 బంతుల్లో 6 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
– NZ beat PAK by 46 runs in 1st T20I
– NZ beat PAK by 21 runs in 2nd T20I
– NZ beat PAK by 45 runs in 3rd T20I
– NZ beat PAK by 7 wickets in 4th T20IWhat a win, Kiwis were 20 for 3 while chasing 159 then Mitchell 72*(44) & Phillips 70*(52) steal the show to make it 4-0. pic.twitter.com/E1ZeGVduOM
— Johns. (@CricCrazyJohns) January 19, 2024
స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే తడబడింది. 20 పరుగులకే ఆ జట్టు మూడు కీలక వికెట్లను కోల్పోయింది. గత మూడు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన ఓపెనర్ ఫిన్ అలెన్.. 8 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ డకౌట్ అవగా ఫస్ట్ డౌన్ బ్యాటర్ విల్ యంగ్ (4) సైతం నిరాశపరిచాడు. ఈ మూడు వికెట్లు సారథి అఫ్రిదికే దక్కాయి. అయితే మిడిలార్డర్లో కివీస్ నమ్మదగ్గ బ్యాటర్ డారెల్ మిచెల్ (44 బంతుల్లో 72 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 70, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 139 పరుగులు జోడించి కివీస్‌కు గెలపును అందించారు. ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టీ20 ఈనెల 21న ఇదే వేదికగా జరుగనుంది.