Paris Olympics | పారిస్: ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అంచెలంచెలుగా పారిస్కు వెళ్తున్న భారత బృందంలో మరో 49 మంది క్రీడాకారులు సోమవారం ఫ్రాన్స్ రాజధానికి చేరుకున్నారు. టేబుల్ టెన్నిస్, టెన్నిస్, ఆర్చరీ, భారత హాకీ, షూటింగ్ జట్లకు చెందిన 39 మంది క్రీడాకారులు ఒలింపిక్ గ్రామానికి చేరారు. ఇప్పటికే బాక్సింగ్, అథ్లెటిక్స్ నుంచి పలువురు తొలి అంచెలోనే పారిస్కు వెళ్లిన విషయం విదితమే.