గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 16:38:03

భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌కు ప్రేక్షకులకు అనుమతి

భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌కు   ప్రేక్షకులకు అనుమతి

మెల్‌బోర్న్:‌  ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆస్ట్రేలియాలో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.  భారత్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించేందుకు  క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్‌-19   కారణంగా ప్రస్తుతం ఖాళీ స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.  మార్చి తర్వాత తొలిసారి  లైవ్‌ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులను అనుమతించేందుకు సీఏ సన్నాహాలు చేస్తోంది.  టెస్టు మ్యాచ్‌లు జరిగే వేదికల్లో ఆయా ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రేక్షకులను అనుమతించనున్నారు.

తొలి టెస్ట్ - అడిలైడ్ ఓవల్ (డిసెంబర్ 17-21) - సీటింగ్‌ కెపాసిటీలో 50 శాతం అంటే   ప్రతి రోజు 27,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

రెండో టెస్ట్‌-  ఎంసీజీ (డిసెంబర్ 26-30) - బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్రతి రోజు 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించేందుకు  విక్టోరియా  ప్రభుత్వం ఆమోదించింది.

మూడో టెస్ట్ - ఎస్సీజి (జనవరి 7-11) - మొత్తం సామర్థ్యంలో 50 శాతం లేదా 23,000 మంది అభిమానులకు అనుమతి

నాలుగో టెస్ట్ - గబ్బా (జనవరి 15-19) - 30వేల మంది అభిమానులు, లేదా దాని సామర్థ్యంలో 75 శాతం