IPL 2024 : పదహారు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మరో సీజన్‌కు సిద్ధమవుతోంది. మరో రెండు వారాల్లో మినీ వేలం మొదల్వనుంది. ఈసారి వేలంలో 1,166 మంది పాల్గొంటున్నారు. అయితే.. 2024 ఎడిషన్ వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈసారి రూ. 2 కోట్ల కనీస ధరతో 25 మంది క్రికెటర్లు వేలానికి వస్తున్నారు. వీళ్లలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హీరోలతో పాటు ముగ్గురు టీమిండియా ఆటగాళ్లూ ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు వేలంలో భారీ ధరకు తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు.
భారత్ – హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్.
ఇంగ్లండ్ – హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్.
ఆస్ట్రేలియా – ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, సియాన్ అబాట్.
దక్షిణాఫ్రికా – రీలే రస్సో, రసీ వాండర్ డస్సెన్, గెరాల్డ్ కోయెట్జీ.
అఫ్గనిస్థాన్ – ముజీబ్ ఉర్ రెహ్మాన్.
బంగ్లాదేశ్ – ముస్తాఫిజుర్ రెహ్మాన్.
శ్రీలంక – ఏంజెలో మాథ్యూస్.
డిసెంబర్ 19న దుబాయ్‌లో 17వ సీజన్ మినీ వేలం(IPL Mini Auciton) జరుగనుంది. ఈసారి 1,166 మంది పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 212 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా ఈసారి 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. వీళ్లలో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉండనున్నారు. నిరుడు కొచ్చిలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు కొన్నది. ఐపీఎల్ చరిత్రలో ఒక ప్లేయర్‌కు అంత ధర పెట్టడం అనేది ఒక రికార్డు.