Ganja | జహీరాబాద్ సమీపంలో బోల్తాపడిన కారు.. భారీగా గంజాయి లభ్యం
సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని జహీరాబాద్ మండలం బూజ్నేల్లి సమీపంలో ఓ కారు (TS07EZ 7397) బోల్తా పడింది.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని జహీరాబాద్ మండలం బూజ్నేల్లి సమీపంలో ఓ కారు (TS07EZ 7397) బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో పెద్దమొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. అది క్వింటాలుకుపైగా ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత అందులో వచ్చిన వ్యక్తులు కారును అక్కడే వదిలి వెళ్లినట్లు చెప్పారు. దాని విలువ రూ.50 లక్షలకుపైగా ఉంటుందన్నారు.
కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు. చుట్టుపక్క ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కర్ణాటక సరిహద్దుల్లో ప్రమాదం జరగడంతో దానిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Ganja
- karnataka
- Odisha
- overturned
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

