Health Tips | చలికాలం జర భద్రం.. ఈ జాగ్రత్తలు మస్ట్‌గా తీసుకోండి
Health Tips | చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.
Health Tips | చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య నియమాలు పాటించక పోవడంతో జబ్బుల బారినపడతారని నిపుణులు పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జబ్బులు వారిని పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
న్యాల్కల్, డిసెంబర్ 1 : చలికాలంలో చల్లని వాతావరణం వణికిస్తుంది. పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ కాలంలో ఆహ్లాదం మాటున జబ్బులు పొంచి ఉంటాయి. ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్ ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, చిన్నారులు బయట తిరగకపోవడం మంచిదని, తప్పనిసరైతే తలకు మఫ్లర్, మంకీ టోపీలు, ముఖానికి మాస్కులు ధరంచి బయటకు రావడం మంచిదంటున్నారు. దీంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల శుభ్రత చాలా ముఖ్యమని, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు వ్యాప్తిచెంది టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా, మెదడువాపు, విషజ్వరాలు బారిన ప్రమాదం ఉంటుందన్నారు. తాగునీటి విషయంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలుషిత నీరు తాగితే డయేరియా వ్యాపించే ప్రమాదకరంగా పరిణమిస్తుందని పేర్కొంటున్నారు.గాలి ద్వారా స్వైన్‌ఫ్లూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తక్కవగా ఉన్న వారికి ఎక్కువగా జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం, రోగనిరోధక శక్తి పెంచే ఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో జాగ్రత్తలు పాటించాలి..
చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులు, చల్లగాలిలో, మంచుపట్టిన సమయంలో బయట తిరగడం మంచిదికాదు. ముఖ్యంగా చలికాలంలో ఏసీలు, ప్యాన్లు, కూలర్లు వాడకం తగ్గించాలి. చర్మంపై అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో బయట తిరగడంతో జలుబు, జ్వరం, ఫ్లూ వంటివి వ్యాధులు సోకితే ఆరోగ్యం పాడవుతుంది. వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి.
– గణపతిరావు, వైద్యుడు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం న్యాల్కల్
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన సమయంలో ఉపశమనం కోసం సొంత వైద్యం మానుకోవాలి.
* వైద్యులను సంప్రదించి వారి సూచనలు మేరకు మందులు వాడాలి
* కాచి చల్లార్చిన నీటిని, వేడి ఉన్న అహారాన్ని తీసుకోవడం మంచింది.
* చలికాలంలో చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం. చేతుల మంచిగా కడుకున్న తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి.
* కాళ్లు, చేతులు గోరువెచ్చని నీటితో కడుక్కుని వ్యాస్‌లెన్, స్కిన్లోషన్ రాసుకోవాలి
* ఇంటి పరిసరాలు, ఇంట్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలి. దోమతెరలను వాడటం మంచిది.
* శీతల పానియాలు, ఐస్క్రీంలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వాటిని చిన్నారులకు ఇవ్వకూడదు.
* చిన్నారులకు స్వెటర్లు వేయకుండా ఇంటాబయట తిరగనివ్వద్దు
* గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు చాలా జాగ్రతగా ఉండాలి.
* వీలైనంత వరకు బయట తిరగరాదు. దీంతో గుండెపోటు, ఛాతినొప్పి అవకాశాలు ఎక్కువగా వస్తాయి.
* హృద్రోగంతో బాధ పడేవారు సమయానికి మందులు వేసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
* వీలైనంత వరకు సూర్యుడు కాస్త వెలుగులోకి వచ్చిన సమయంలోనే జాగింగ్, వ్యాయామం చేయాలి.
* సాయంత్రం, రాత్రివేళల్లో వాహనాన్ని నడపక పోవడం మంచిది.
* ముఖ్యంగా ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లే సమయంలో బాగా చలివేస్తుంది. అలాంటప్పుడు స్కార్ప్, జర్కిన్, తలకు హెల్మెట్, మంకీక్యాప్స్, కాళ్లకు షూ, చేతులకు గౌజులు వేసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

