న్యూఢిల్లీ: భారత్ వేదికగా తొలిసారి జరుగనున్న ఖో ఖో ప్రపంచకప్లో ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతున్నది. గ్రామీణ క్రీడగా పేరొందిన ఖో ఖో మెగాటోర్నీలో ఆడేందుకు అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, న్యూజిలాండ్ తమ సంసిద్ధత తెలియజేశాయి.
జనవరి 13నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న ప్రపంచకప్లో 24 జట్లు పోటీపడనున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నీ జరుగుతుందని జాతీయ ఖో ఖో ఫెడరేషన్ అధ్యక్షుడు సుదాంశు మిట్టల్ పేర్కొన్నాడు.