దుబాయ్ : వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్‌నకు తేదీలు ఖరారయ్యాయా? అంటే అవుననే అంటున్నాయి ఐసీసీ వర్గాలు. 2026 ప్రథమార్థంలోనే ఈ టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. 2026 ఫిబ్రవరి 07 నుంచి మార్చి 08 వరకు టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించనున్నట్టు సమాచారం.
ఫైనల్‌కు అహ్మదాబాద్ లేదా కొలంబో (ఒకవేళ పాకిస్థాన్ ఆడి ఫైనల్ చేరితే) ఆతిథ్యమివ్వనున్నట్టు ఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. భారత్‌లో ఐదు, శ్రీలంకలో రెండు వేదికల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగనుండగా వాటిని ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.