IPL | ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 21న మొదలవనుంది. మార్చి 21 నుంచి మే 25 దాకా ఈ మెగాలీగ్ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు గతంలో ప్రకటించిన తేదీ(మార్చి 14) లో స్వల్ప మార్పులు చేసింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్‌నూ కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ వేదికగా నిర్వహించనున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక షెడ్యూల్ వెలువడనుంది. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్).. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 దాకా జరుగనుంది.