క్రిస్ట్‌చర్చ్ : వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కీలక ఆధిక్యం దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 231 రన్స్‌కు ఆలౌట్ అయిన ఆ జట్టు.. వెస్టిండీస్‌ను 167 పరుగులకే కట్టడి చేసింది. జాకబ్ డఫ్ఫీ (5/34) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా మాథ్యూ హెన్రీ (3/43) రాణించాడు.
విండీస్ ఇన్నింగ్స్‌లో చందర్‌పాల్ (52), హోప్ (56) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫలితంగా న్యూజిలాండ్‌కు 64 పరుగుల ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 32 రన్స్ చేసింది.