Boxer Brain Dead : బాక్సింగ్‌నే కెరీర్‌గా, ప్రాణంగా భావించిన ఓ యువకుడి జీవితం విషాదంగా ముగిసింది. ఎన్నో ఆశలతో బాక్సింగ్ రింగ్‌లో అడుగుపెట్టిన అతడికి అదే ఆఖరి రోజు అయింది. ప్రత్యర్థులపై పంచ్‌లు కురిపించే క్రమంలో అతడు ఆ రింగ్‌లోనే కుప్పకూలాడు. అనంతరం ఆ బాక్సర్‌ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్(Brain Dead) అయినట్టు చెప్పారు. ఈ హృదయవిదారక ఘటన మన గుజరాత్‌లోనే జరిగింది.
అసలేం జరిగిందంటే.. 19 ఏండ్ల బాక్సర్ కరన్ పిపలియా(Karan Pipaliya) గుజరాత్ స్టేట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నాడు. పురుషుల 63కిలోల విభాగంలో పోటీ పడిన కరన్‌కు ఏమైందో తెలియదు ఉన్నట్టుండి రింగ్లనే కుప్పకూలాడు. దాంతో, కంగారు పడిన రిఫరీలు, నిర్వాహకులు మ్యాచ్‌ను ఆపేశారు. వెంటనే కరన్‌ను దవాఖానకు తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పారు.
కరన్ రింగ్‌లోనే కుప్పకూలడానికి కారణంగా మెదడుకు సంబంధించిన హీమోర్రేజ్(Hemorra) అనే సమస్య. దాంతో, ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు అతడికి సర్జరీ కూడా చేశారు. అనంతరం సూరత్‌లోని సిమ్స్ అనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే కరన్ బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ మీద పెట్టారు. తమ కొడుకు బతుకుతాడనే నమ్మకంతో అతడి తల్లిదండ్రలు కండ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.