Kapil Dev : భారత జట్టుకు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు గత పదేండ్లుకు పైగా సేవలందిస్తున్నారు. కెప్టెన్‌గా, ఆటగాడిగా తమదైన ముద్ర వేస్తూ జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. టీమిండియాకు కుడి, ఎడమ భుజాలుగా నిలుస్తున్న ఈ ఇద్దరి కెరీర్ దగ్గర పడింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. కొత్తతరం దూసుకొస్తుండడంతో వన్డే, టెస్టులకు కూడా ఈ దిగ్గజ ఆటగాళ్లు త్వరలోనే గుడ్ బై చెప్పేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ (Kapil Dev ) ‘రోకో’ భవితవ్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘రోహిత్, కోహ్లీలు ఎప్పటివరకైతే ఫిట్‌గా ఉంటారో అప్పటివరకూ ఆడాలి. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఇద్దరూ క్రికెట్‌ను వీడొద్దు. రవి శాస్త్రి(Ravi Shastri) చిన్న వయసులోనే ఆటకు అల్విదా చెప్పాడు. అయితే.. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)సుదీర్ఘ కెరీర్‌ను ఎంజాయ్ చేశాడు. అయితే.. ఇప్పుడు రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అయింది. నా దృష్టిలో మాత్రం ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నంత కాలం ఆడొచ్చు’ అని కపిల్ అభిప్రాయపడ్డాడు.
అంతేకాదు 26 ఏండ్ల నుంచి 34 ఏండ్ల మధ్య ప్రతి క్రికెటర్ అత్యద్భుతంగా సాగుతుంది. ఆ తర్వాత ఫిట్నెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువ రోజులు ఆడాలంటే ఫిట్‌గా ఉండడం తప్పనిసరి’ అని కపిల్ వెల్లడించాడు. ప్రస్తుతం కోహ్లీకి 35 ఏండ్లుకాగా కెప్టెన్ హిట్‌మ్యాన్‌కు 37 ఏండ్లు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్గ – వాస్కర్ ట్రోఫీ.. ఆపై ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC)ఫైనల్, చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) విజయంపై ఈ ఇద్దరూ కన్నేశారు. రోహిత్, కోహ్లీలు ఇంకో మూడేండ్లు ఫిట్‌గా ఉంటే వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశముంది.
లార్డ్స్‌లో వరల్డ్ కప్ అందుకుంటూ..
టీమిండియా గొప్ప సారథుల్లో కపిల్ దేవ్ పేరు అజరామరంగా నిలిచిపోతుంది. 1983లో భారత్‌ను విశ్వ విజేతగా నిలిపిన కపిల్ 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా రాణించిన ఈ హర్యానా హరికేన్ సుదీర్ఘ ఫార్మాట్లో 5,248 పరుగులు, వన్డేల్లో 3,783 రన్స్ సాధించి.. వరుసగా 434, 253 వికెట్లు పడగొట్టడు. ప్రపంచ క్రికెట్లో భారత దేశ పేరును గట్టిగా వినిపించిన కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా బాలీవుడ్లో 83 పేరుతో సినిమా కూడా వచ్చింది.