న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశంలో శాససభ పదవీ కాలం ముగియనున్న మరికొన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ర్టాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి మధ్యలో ప్రకటించనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం తెలిపారు. ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ఐదు అసెంబ్లీల పదవీ కాలం మే, జూన్‌తో ముగుస్తున్నది. ఇప్పటికే ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి ఎన్నికల సంసిద్ధతను అంచనా వేశారు. ప్రస్తుతం ఒక బృందం అస్సాంలో పర్యటిస్తున్నది.