న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పునరుత్పాదక శక్తితో నడిచే హైపర్‌స్కేల్ ఏఐ-రెడీ డాటా సెంటర్లను 2035 నాటికి అభివృద్ధి చేయడానికి అదా నీ గ్రూపు మంగళవారం 100 బిలియన్ డాలర్ల(రూ. 9,06,480 కోట్లు)పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్య సర్వర్ తయారీ, క్లౌట్ ఫ్లాట్‌ఫామ్‌లు, సహాయక పరిశ్రమల్లో అదనంగా 150 బిలియన్ డాలర్లను(రూ. 13,59, 720 కోట్లు) ప్రోత్సహిస్తుందని, భారత్‌లో 250 బిలియన్ డాలర్ల(రూ.22,66,200 కోట్లు) ఏఐ మౌలిక సదుపాయాల వాతావరణాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొన్నది.